విరాట్ ఖాతాలో మరో రికార్డ్... కానీ క్రికెట్ లో కాదు..!

విరాట్ ఖాతాలో మరో రికార్డ్... కానీ క్రికెట్ లో కాదు..!

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి అందరికి తెలిసిందే. 2008 లో అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చిన విరాట్ అప్పటినుండి ఇప్పటివరకు అద్భుతమైన ప్రదర్శన చేస్తూనే ఉన్నాడు. మైదానం లో పాత రికార్డులను బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో రికార్డ్ సాధించాడు విరాట్, కానీ అది క్రికెట్ కు సంబంధించింది కాదు. కోహ్లీ ఆటకు చాలామంది అభిమానులు ఉన్నారు. కేవలం మన భారత్ లో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా విరాట్ కు ఫాన్స్ ఉన్నారు. వారందరు విరాట్ ను సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటారు. అందువల్ల తనకు సంబంధించిన అన్ని  విషయాలను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాడు కోహ్లీ. ఇప్పుడు ఆ సోషల్ మీడియాలోనే తాజాగా ఆసియాలోనే ఏ సెలెబ్రిటీ సాధించని రికార్డును కోహ్లీ సాధించాడు. ఇంస్టాగ్రామ్ లో కోహ్లీ ఫాలోవర్స్ సంఖ్య 75 మిలియన్స్ దాటేసింది. దాంతో ప్రపంచ అథ్లెట్ల అత్యధిక ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ జాబితాలో కోహ్లీ నాలోగో స్థానం లో ఉన్నాడు. మొదటి మూడు స్థానాల్లో క్రిస్టియానో రొనాల్డోకి, లియోనెల్  మెస్సీ, నెయ్‌మార్ ఉన్నారు.