కోహ్లీ అరుదైన ఘనత..

కోహ్లీ అరుదైన ఘనత..

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 22 వేల పరుగులు పూర్తిచేసుకున్నాడు. అలాగే, ఆస్ట్రేలియాపై వన్డేల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. కోహ్లీ 40 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. అతడి కంటే ముందు సచిన్ టెండూల్కర్, రోహిత్‌శర్మ ఉన్నారు.  

250 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడిన తొమ్మిదో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఆదివారం సిడ్నీలో ఆస్ట్రేలియాతో ఆడుతున్న వన్డే మ్యాచ్‌తో కోహ్లి 250 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్నాడు. మరోవైపు కోహ్లి టీమిండియా తరఫున 86 టెస్టులు, 82 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మట్లలో కలిపి కోహ్లీ 21 వేలకు పైగా పరుగులు సాధించాడు.