దుబాయ్ లో అనుష్క శర్మ... ఎందుకంటే..?

దుబాయ్ లో అనుష్క శర్మ... ఎందుకంటే..?

ఈ మధ్యే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. నేను త్వరలో తండ్రి కాబోతున్నానని కోహ్లీ తన ట్విట్టర్ లో తెలిపాడు. అయితే ప్రస్తుతం యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ కోసం తన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుతో కలిపి కోహ్లీ దుబాయ్ కి వెళ్ళాడు. ఇక విరాట్ భార్య అనుష్క కూడా తాజాగా దుబాయ్ కి చేరుకుంది. ఎందుకంటే... వారు తల్లిదండ్రులు కాబోతున్న సందర్బంగా ఆర్సీబీ జట్టు సభ్యుల మధ్య కేక్ ను కట్ చేసారు కోహ్లీ దంపతులు. అయితే ఇందుకోసమే అనుష్క కూడా దుబాయ్ కి వెళ్ళింది. వారు కేక్ కట్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. డిసెంబర్ 11, 2017 న పెళ్లి చేసుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వచ్చే ఏడాది జనవరిలో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇక నిన్న తమ క్వారంటైన్ ముగించుకున్న ఆర్సీబీ జట్టు ఐపీఎల్ 2020 కోసం ప్రాక్టీస్ ప్రారంభించింది.