భారత ఓటమి పై కోహ్లీ ఏమన్నాడంటే..?

భారత ఓటమి పై కోహ్లీ ఏమన్నాడంటే..?

ప్రస్తుతం టీం ఇండియా ఆసీస్ పర్యటనలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భాగంగా మొదట వన్డే సిరీస్ లో తలపడుతున్నాయి ఈ రెండు జట్లు. కానీ మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లలో ఓడిపోయి సిరీస్ కోల్పోయింది భారత జట్టు. అయితే ఈ రోజు జరిగిన రెండో వన్డే మ్యాచ్ ఓటమి తర్వాత కోహ్లీ మాట్లాడుతూ... మేము బౌలింగ్ లో విఫలమయ్యాము. అలాగే ఆసీస్ బ్యాటింగ్ లైనప్ బాగా స్ట్రాంగ్ గా ఉంది. ఇక ఇక్కడ  పరిస్థితులు వారికి బాగా తెలుసు. అయిన కూడా మేము 390 పరుగుల ఛేదనలో 51 పరుగుల దూరంలో ఆగిపోయాము. అంటే మా బ్యాటింగ్ బాగానే సాగింది. ఇక ఈ మ్యాచ్ లో ఆసీస్ ఆటగాళ్లు అయ్యర్ అలాగే  నా క్యాచ్ అద్భుతంగా అందుకున్నారు. ఆ రెండు క్యాచ్ లే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాయి అని కోహ్లీ పేర్కొన్నాడు. ఇక ఈ రెండు జట్ల మధ్య నామమాత్రపు మూడో మ్యాచ్ వచ్చే నెల 1న జరగనుంది.