‘లైగర్’ సెట్ లో రమ్యకృష్ణ: విజయ్ తల్లి పాత్రలో!

‘లైగర్’ సెట్ లో రమ్యకృష్ణ: విజయ్ తల్లి పాత్రలో!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న సంగతి తెలిసిందే. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘లైగర్‌’ కోసం బాక్సింగ్‌లో విజయ్‌ శిక్షణ తీసుకున్నారు. ఇందులో విజయ్‌దేవరకొండ పొడవాటి జుట్టుతో మాస్‌ లుక్‌లో విభిన్నంగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లైగర్‌’ ఫస్ట్‌లుక్‌ సినీ ప్రియులను ఎంతగానో ఆకర్షించింది. విజయ్‌కు జోడిగా హిందీ భామ అనన్య పాండే నటిస్తోంది. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.  ఇక, ‘లైగర్‌’ విజయ్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించనుంది. కొడుకు జాతీయ ఛాంపియన్‌ కావాలని కలలు కంటూ, తెలంగాణ యాసలో మాట్లాడే పాత్ర అని తెలుస్తోంది. తాజాగా రమ్యకృష్ణ, విజయ్ షూటింగ్ సెట్స్ లో కనిపించిన ఫోటోలు వైరల్ గా మారాయి. సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని ఛార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.