నువ్వు చనిపోయావ్...డిశ్చార్జి ఎలా చేస్తాం ?

నువ్వు చనిపోయావ్...డిశ్చార్జి ఎలా చేస్తాం ?

కోవిడ్ పేషెంట్ల పాలిట విశాఖలోని విమ్స్ ఆసుపత్రి శాపంగా మారింది. కరోనా తగ్గిన ఒక పేషెంట్ తనను డిశ్చార్జ్ చేయమని అడిగితే నువ్వు చనిపోయావు ఎలా డిశ్చార్జ్ చేస్తామని అడిగారట అక్కడి సిబ్బంది. వింతగా ఉన్న ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే గతనెల 27న కరోనా తో విమ్స్ లో టెక్కలికి చెందిన లక్ష్మణరావు (42) చేరాడు. ఈనెల 7న కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్ఛార్జి చేస్తామని లక్ష్మణరావుకు విమ్స్ వైద్యులు చెప్పారు. అయితే ఇంటి కెళ్లేందుకు లగేజ్ సర్దుకునే సమయంలో డిశ్చార్జి ఫారమ్ లేదంటూ లక్ష్మణరావును ఐసీయూలోనే ఉన్చేసారు విమ్స్ వైద్యులు. అయితే తాను కిడ్నీ పేషెంట్ అయినందున డయాలసిస్ చేయించుకోవాలని లక్ష్మణరావు వేడుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. నాలుగురోజుల తర్వాత నువ్వు చనిపోయావ్...డిశ్చార్జి ఎలా ఇస్తామంటూ విమ్స్ సిబ్బంది షాకిచ్చారు. నేను బతికి ఉంటే చనిపోయనని ఎలా అంటారంటూ వారిని నిలదీయడంతో ఎట్టకేలకు డిశ్ఛార్జి చేశారు.