బాలయ్య విలన్‌గా స్టార్ హీరో ఫిక్స్.. ఎవరంటే..

బాలయ్య విలన్‌గా స్టార్ హీరో ఫిక్స్.. ఎవరంటే..

నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా చేస్తున్న సినిమా బలరామయ్య బరిలోకి దిగితే. ఈ సినిమాకి స్టార్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో ఇది ముచ్చటగా మూడో సినిమా గతంలో వచ్చిన రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. దాంతో బీబీ3 కూడా మరో బ్లాక్ బస్టర్ అవుతుందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. కానీ ఇంతవరకు ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎవరు చేయనున్నారన్నది తెలీదు. ఇందులో బాలయ్యకు విలన్‌గా బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి చేయనున్నాడని ఇదివరకు వార్తలు వచ్చాయి. కానీ తర్వాత కూడా బోయపాటి మరికొందరితో చర్చలు చేయడంతో ఇందులో సునీల్ శెట్టి విలన్ కాదని తెలిసింది. అయితే తాజాగా ఈ సినిమాలో బాలయ్యతో తలపడేందుకు బాలీవుడ్ నటుడిని ఓకే చేశారట. అదెవరో కాదండీ బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి. ఈ భారీ యాక్షన్ సినిమాలో విలన్‌గా సునీల్ శెట్టి ఫిక్స్ అయ్యాడట. ఇందులో సీనియర్ బాలయ్యకు విలన్‌గా సునీల్ కనిసిస్తాడట. దాంతో సునీల్ శెట్టి ఎలా కనిపిస్తాడని, అతడి పాత్ర ఎలా ఉంటుందని అభిమానులు ఎదరుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అంతేకాకుండా ప్రముఖ నటుడు శ్రీకాంత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఈ టీంతో బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ పక్కా అని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. మరి వారి అంచనాలను బాలయ్య అందుకుంటాడో చూడాలి.