రామాల‌యానికి భూమిపూజ... పూజారికి బెదిరింపులు..

రామాల‌యానికి భూమిపూజ... పూజారికి బెదిరింపులు..

శ్రీ‌రామ‌భ‌క్తుల చిర‌కాల కోరిక త్వ‌ర‌లోనే తీర‌బోతోంది.. దీనికోసం అయోధ్యలో ఈ నెల 5వ తేదీన రామాల‌య నిర్మాణానికి భూమి పూజ నిర్వ‌హించ‌నున్నారు.. అయితే.. ఈ పూజా కార్య‌క్ర‌మానికి ముహూర్తంపెట్టిన పూజారికి గుర్తుతెలియ‌ని వ్య‌క్తుల నుంచి బెదింపులు వ‌స్తున్నాయి.. క‌ర్ణాట‌క‌కు చెందిన పండితుడు ఎన్ఆర్ విజ‌యేంద్ర శ‌ర్మ .. రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు స‌భ్యుడు స్వామి గోవింద్ దేవ్ గిరిజికి స‌న్నిహ‌తులు.  ఆయ‌న కోరిక మేర‌కు ఏప్రిల్‌లో అక్ష‌య తృతీయ నాడు ముహూర్తం పెట్టారు. అయితే, లాక్‌డౌన్ కార‌ణంగా ఈ కార్య‌క్ర‌మం వాయిదా ప‌డింది. దీంతో, ఆగ‌స్టు 5వ తేదీన భూమిపూజ‌కు ముహూర్తంగా ఖ‌రారు చేశారు.. ముహూర్తం ప్ర‌కారం రేపు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌లోపు పూజ నిర్వ‌హించాల్సి ఉంటుంది. అయితే, విజయేంద్రకు ఫోన్‌లో బెదిరింపులు వచ్చాయి. దీంతో.. పోలీసుల‌ను ఆశ్ర‌యించారు‌.. రామాల‌య భూమిపూజ‌కు ముహూర్తం తేదీని ఎందుకు నిర్ణ‌యించావ‌ని గుర్తు తెలియని వ్యక్తి త‌న‌ను ఫోన్ చేసి బెదిరించార‌ని ఈ సంద‌ర్భంగా మీడియాకు తెలిపారు విజ‌యేంద్ర శ‌ర్మ‌.. ఇక‌, కేసు న‌మోదు చేసిన పోలీసులు.. ఓవైపు ద‌ర్యాప్తు జ‌రుపుతూనే మ‌రోవైపు.. బెలగావిలోని పూజారి నివాసం వ‌ద్ద‌ పోలీసులను మోహరించారు.