అమెజాన్ ప్రైమ్ లో ‘మాస్టర్’

అమెజాన్ ప్రైమ్ లో ‘మాస్టర్’

తమిళ స్టార్ హీరో విజయ్, లోకేష్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా‘మాస్టర్’. సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మాళవిక మోహనన్, ఆండ్రియా జర్మియా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు. స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి విలన్ గా ఆకట్టుకున్నాడు. ‘మాస్టర్’ తెలుగులో మిశ్రమ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం కుమ్మేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.200 కోట్లు వసూలు చేసే దిశగా పయనిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఫిబ్రవరి 12 నుంచి అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.