విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం...  

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం...  

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్యాలెస్ లో మంటలు చెలరేగాయి.  కరోనా సమయంలో స్వర్ణ ప్యాలెస్ ను కరోనా ఆసుపత్రిగా మార్చారు.  ఈ స్వర్ణ ప్యాలెస్ లో 50 కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు.  ఈ తెల్లవారు జామున 5 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది.  హోటల్లోని సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో ప్రాణనష్టం తప్పిందని చెప్పాలి.  రోగులను స్వర్ణ ప్యాలెస్ నుంచి మరొక ఆసుపత్రికి తరలించారు.  వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.