ప్రమాదకరంగా బెజవాడ కనకదుర్గ వారధి..

ప్రమాదకరంగా బెజవాడ కనకదుర్గ వారధి..

విజయవాడ కనక దుర్గ వారధి పరిస్థితి ప్రమాదకరంగా మారింది. గుంటూరు-విజయవాడ రూట్లో బ్రిడ్జ్ పై కాంక్రీట్ దెబ్బతినడంతో.. ఇనుప ఊచలు పైకి లేచాయి. వారధి దెబ్బతిని నెలలు గడుస్తున్నా.. నేషనల్ హైవే అథారిటీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండున్నర కిలోమీటర్ల వారధిలో పదుల సంఖ్యలో గుంతలు కనిపిస్తున్నాయి. ఇనుప ఊచలు పైకి లేస్తున్నా.. నెలల గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.. ఇప్పటికైనా వారధిపై దృష్టి సారించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఓవైపు వర్షాలు.. మరోవైపు.. వారధిపై ఇనుప ఊచలు పైకి లేచి ప్రమాదకరంగా మారడంతో.. భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.