స్వర్ణ ప్యాలెస్‌ ప్రమాదం..మృతుల కుటుంబాలకు కేంద్రం ఆర్థికసాయం..!

స్వర్ణ ప్యాలెస్‌ ప్రమాదం..మృతుల కుటుంబాలకు కేంద్రం ఆర్థికసాయం..!

విజయవాడలోని ఏలూరు రోడ్డు చల్లపల్లి బంగ్లా సమీపంలోని స్వర్ణ ప్యాలెస్‌ ‌లో నిర్వహిస్తున్న ప్రైవేటు కోవిడ్‌ ఆసుపత్రిలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకున్నసంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 10మంది ప్రాణాలు కోల్పోగా 30మంది గాయపడ్డారు. కాగా మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రూ.50లక్షల పరిహారం ప్రకటించింది. అయితే ఇప్పుడు కేంద్రం కూడా మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించి, పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుండి నిధులు విడుదల చేసింది.