మున్సిపల్ ఎన్నికలపై చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి

మున్సిపల్ ఎన్నికలపై చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్‌ అయ్యారు. వచ్చే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో చంద్రబాబుకు భంగపాటు తప్పదని పేర్కొన్నారు. "వైజాగ్ స్టీల్ పై ప్రధానికి రాసిన లేఖతో, తను గోబెల్స్ ప్రచారాలకు పాల్పడ్డట్టు చంద్రబాబు అంగీకరించాడు. జగన్ గారి ప్రభుత్వం ప్లాంటును ప్రైవేటు సంస్థలకు అమ్మాలని చూస్తోందని మొన్నటి దాకా దుష్ప్రచారం చేసాడు. కేంద్ర బడ్జెట్ లో ప్రైవేటీకరణను ప్రతిపాదించారని లేఖలో ప్రస్తావించాడు.  గుండె దిటవు చేసుకో చంద్రబాబూ. జరగబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా నువ్వు మూర్ఛపోయే విధంగానే ఉంటాయి. డబ్బు, మద్యంతో శాసించే జమానా లేదిప్పుడు. జగన్నాథ రథచక్రాలకు అడ్డంగా వెళ్లే సాహసం చేయొద్దు ఈ వయసులో." అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక అంతకు ముందు ట్వీట్‌లో  "41 శాతం సర్పంచ్ పదవులు గెలిచామంటూ జబ్బలు చరుస్తున్నాడు చంద్రబాబు. హిందూపురం, అమరావతి, కుప్పంలోనే డిపాజిట్లు రాలేదు మీ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నచోట సింగిల్ డిజిట్ దాటలేదు. మీ కాకిలెక్కల్ని జనం నమ్ముతారా?దమ్ముంటే గెలిచారంటున్న పంచాయతీల్ని యెల్లో పేపర్లలోనైనా ప్రకటించండి" అంటూ ఎద్దేవా చేశారు.