ప్రభాస్‌కి విలన్‌గా తమిళ హీరో..?
రెబల్ స్టార్ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత సాహోతో అందరిని అలరించిన ప్రబాస్. ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దీని తరువాత కేజీఎఫ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మరో సినిమా చేయనున్నాడు. ప్రభాస్, ప్రశాంత్ కాంబోలో రానున్న సినిమాకు "సలార్" పేరును ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్, విలన్ పాత్రధారులను వెతకడం కష్టం అయిపోయింది. ప్రభాస్ స్థాయికి తగ్గా హీరోయిన్, విలన్ అంటే బాలీవుడ్, టాలీవుడ్‌లలో చాలా అరుదుగా ఉన్నారు. దాంతో ఈ పాత్రల కోసం నటులను వెతకడం దర్శకనిర్మాతలకు తలనొప్పిగా మారింది. అయితే సలార్ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నారు. దీనిని తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమా విలన్ గురించి తాజా వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ను ఢీకొట్టేందుకు తమిళ్ హీరో విజయ్ సేతుపతిని అనుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల రిలీజైన విజయ్ "మాస్టర్" సినిమాలో విలన్‌గా నటించారు సేతుపతి. ఈ సినిమాలో ఆయన పాత్రకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ప్రభాస్ సలార్ మూవీలోనూ సేతుపతి విలన్‌గా చేయబోతున్నారట. ఇందులో భాగంగానే ప్రభాస్-సేతుపతి కాంబినేషన్ సన్నివేశాలు ముందుగానే తెరకెక్కించనున్నారని టాక్. అయితే.. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)