విజయ్ సేతుపతితో జత కట్టనున్న టాలెంటెడ్ హీరోయిన్

విజయ్ సేతుపతితో జత కట్టనున్న టాలెంటెడ్ హీరోయిన్

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . 2012లో సుందర పాండియన్ సినిమాలో విలన్ రోల్ చేసి వావ్ అనిపించుకున్నారు. అప్పటి నుంచి వరుసగా సినిమా రంగంలో హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నారు. ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం సినిమా రంగంలో కూడా విజయ్ సేతుపతి దూసుకుపోతున్నారు. తెలుగులోత్వరలో ఉప్పెన సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే ఇటీవలే శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న 800 లో నటిస్తున్నానని ప్రకటించారు..దీనితోపాటు మలయాళంలో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రానికి సంతకం చేశారు. అన్ని దక్షిణాది భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రంలో సేతుపతి సరసన టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ నటించనున్నట్లు సమాచారం. ఈ ఇద్దరి నటన సినిమాకు హైలైట్ గా ఉంటుందని టాక్ .