ఎన్‌టీఆర్ విలన్‌గా విలక్షణ నటుడు?

ఎన్‌టీఆర్ విలన్‌గా విలక్షణ నటుడు?

యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అతడు జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా తరువాత ఎన్‌టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నారు. వీరి కాంబోలో రానున్న సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే పేరును ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాలోని ఇతర నటీనటుల విషయంలో అనేక వార్తలు వస్తున్నాయి. ఇందులో హీరోయిన్‌గా ఎవరు చేస్తారు అన్న అనుమానానికి ముగ్గురు భామల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాలో విలన్ పాత్ర విషయంలో కూడా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా చేయనున్నారన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం విజయ్‌కి ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. అయితే ఎన్‌టీఆర్ సినిమాలో విజయ్ చేయనున్నాడన్న దానిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అతి త్వరలో ఈ విషయంపై క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి. ఈ వార్త కనుక నిజమయితే ఎన్‌టీఆర్ 30 అభిమానులు అంచనాలను మించుతుందని ఊహాగానాలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.