ఆ పథకంతో పేదరికానికి శాశ్వతంగా చెక్...

ఆ పథకంతో పేదరికానికి శాశ్వతంగా చెక్...

మహిళల జీవితాల్లో వెలుగు నింపడానికి ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ చేయూత’ పథకాన్ని సీఎం‌ జగన్‌  బుధవారం ప్రారంభించిన విషయం తెలిసిందే.  వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 23 లక్షల మంది ఖాతాల్లో రూ.18,750 చొప్పున జమ అవుతుంది. అయితే... ఈ పథకంపై వైసీసీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైఎస్ఆర్ చేయూత ప‌థ‌కంతో పేదరికానికి శాశ్వతంగా చెక్ ప‌డ‌నున్న‌ట్లు  ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి అన్నారు. మ‌హిళ‌ల‌కు ఆర్థిక స్వావ‌లంబ‌న క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా వైయస్ఆర్ చేయూత ప‌థ‌కాన్నిఏపీ ప్ర‌భుత్వం  తీసుకువ‌చ్చిన‌ట్లు  ఆయన పేర్కొన్నారు. 45 నుంచి 60 ఏళ్ల మ‌ధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మ‌హిళ‌ల‌కు వైఎస్ఆర్ చేయూత ద్వారా ఆర్థిక సాయం అంద‌నుందని తెలిపారు.  మొత్తం నాలుగేళ్లపాటు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకే డబ్బు జ‌మ‌కానున్న‌ట్లు తెలిపారు. జీవనోపాధి కోసం చిన్న, చిన్న వ్యాపారాలు నడుపుకోవడానికి చేయూతగా ఉండ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.