'అర్జున్ రెడ్డి'కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా...!?

'అర్జున్ రెడ్డి'కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా...!?

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో షాలిని పాండే హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అన్ని ఎమోషన్స్ కలగలిపిన ఈ చిత్రంతో 'అర్జున్ రెడ్డి' పాత్రలో విజయ్ దేవరకొండ జీవించేశాడు. టాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి' ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అంతేనా 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో సునామీ సృష్టించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తమిళంలో 'ఆదిత్య వర్మ'గా సంచలనం సృష్టించింది. గిరీశయ్య దర్శకత్వం వహించాడు. అయితే తాజా సమాచారం ప్రకారం 'అర్జున్ రెడ్డి'కి ఫస్ట్ ఛాయిస్ విజయ్ దేవరకొండ కాదని తెలుస్తోంది. 'అర్జున్ రెడ్డి' సినిమాలో ముందుగా శర్వానంద్ ను అనుకున్నాడట దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. శర్వానంద్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ముందుగా 'అర్జున్ రెడ్డి' స్టోరీని శర్వానంద్ కు వివరించాడట సందీప్. అతనే ఈ చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు చెప్పాడట. నిర్మాతగా, డైరెక్టర్ గా సందీప్ కు పెద్ద బాధ్యత అవుతుందని భావించిన శర్వా అతనిని వేరే నిర్మాతల దగ్గరకు పంపించాడట. అయితే ఆ నిర్మాతలు ఇది రిస్కీ ప్రాజెక్ట్ అని భావించి రిజెక్ట్ చేశారట. అలా శర్వానంద్ చేతి నుంచి ఈ ప్రాజెక్ట్ చేజారిపోయింది. కానీ ఆ అవకాశం విజయ్ దేవరకొండను వరించింది. ఈ చిత్రంతోనే భారీ క్రేజ్ ను సంపాదించాడు విజయ్.