మహేష్ ఛాలెంజ్ ను స్వీకరించిన తమిళ్ స్టార్ హీరో

మహేష్ ఛాలెంజ్ ను స్వీకరించిన తమిళ్ స్టార్ హీరో

సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టినరోజును ఈసారి చాలా సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. కొవిడ్-19 పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించవద్దని, అభిమానులకు మహేష్ ముందే సూచించారు.ఇక తన పుట్టిన రోజున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. దీనిని ఛాలెంజ్ అనేకంటే భవిష్యత్ తరాల మనుగడకు ప్రొటెక్షన్ ప్లాన్ అంటే ఇంకా బావుంటుందని తన పర్సనల్ ఫీలింగ్‌ను బయట పెట్టారు సూపర్ స్టార్. అలాగే మరో ముగ్గురు స్టార్లు జూనియర్ ఎన్టీఆర్, తమిళ స్టార్ హీరో విజయ్, నటి శృతిహాసన్‌లకు మహేష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. మహేష్ విసిరిన ఛాలెంజ్ ను తమిళ్ స్టార్ హీరో విజయ్ స్వీకరించాడు. చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటాడు విజయ్. మహేష్ బాబు విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటానని తెలిపాడు ఈ హీరో.ఇందులో శృతి ఇప్పటికే త్వరలో మొక్కలు నాటుతానని తెలిపింది కూడా. త్వరలోనే జూనియర్ కూడా ఈ ఛాలెంజ్ స్వీకరించనున్నాడు.