సూపర్ స్టార్ సినిమాలో విద్యాబాలన్ .?

సూపర్ స్టార్ సినిమాలో విద్యాబాలన్ .?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బ్యాంకింగ్ జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి.  ఇక మహేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించనున్నాడని తెలుస్తుంది. అంతే కాక ఈ సినిమాకు పాన్ ఇండియా క్రేజ్ రావాలని బాలీవుడ్ నటులను తీసుకుంటున్నారట.ఇక ప్రతినాయకుడు పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇక మహా నటి తో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందట. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ హా మారింది. అదేంటంటే .. 'సర్కారు వారి పాట' సినిమాలో మహేష్ కు సిస్టర్ క్యారక్టర్ చాలా కీలకంగా ఉండనుందట .. అందుకోసం 'డర్టీ పిక్చర్' హీరోయిన్ విద్యాబాలన్ ని సంప్రదిస్తున్నారట. కథలో కీలకమైన ఈ పాత్రలో ఆమె అయితేనే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.