‘యురి’ బేస్ క్యాంప్ లో విక్కీ కౌశల్

‘యురి’ బేస్ క్యాంప్ లో విక్కీ కౌశల్

‘యురి’ సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్న టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్. ఆయనకు ఆర్మీ నుంచీ ఆహ్వానం అందటంతో తాజాగా ‘యురి’ ప్రాంతాన్ని సందర్శించాడు. అక్కడి ఫోటోల్ని నెటిజన్స్ తో షేర్ చేసుకుంటూ... ఆత్మీయంగా ఓ సందేశాన్ని కూడా పంచుకున్నాడు! ‘’కాశ్మీర్ లోని ‘యురి’ బేస్ క్యాంప్ కి నన్ను ఆహ్వానించినందుకు ఇండియన్ ఆర్మీకి మనస్పూర్తిగా ధన్యవాదాలు! యురిలోని స్థానిక ప్రజలు ఎంతో ఆత్మీయత కలిగిన వారు. అలాగే వాళ్లలో ఎంతో ప్రతిభ కూడా ఉంది. అటువంటి వారితో ఒక రోజంతా ఆనందంగా గడిపే అవకాశం సైన్యం అందించిన ఆహ్వానం మేరకే కలిగింది. భద్రతా దళాల సమక్షంలోకి నేను ఇలా వెళ్లగలగటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. థాంక్యూ! జై హింద్!’’. ఇదీ విక్కీ కౌశల్ ‘యురి’ సందేశం.

ఆయన కాశ్మీర్ పర్యటన పూర్తైన తరువాత సొషల్ మీడియాలో తన మెసేజ్ ని ఫాలోయర్స్ తో షేర్ చేసుకున్నాడు...‘యురి’ పర్యటన, భారత ఆర్మీ గురించి విక్కీ కౌశల్ పోస్ట్ పెట్టగానే చాలా మంది పాజిటివ్ గా స్పందించారు. అయితే, వారిలో ‘యురి’ డైరెక్టర్ ఆదిత్య దర్ కూడా ఉండటం విశేషం. ‘ఎన్నో జ్ఞాపకాలు నెమరవేసుకుంటున్నాను’ అంటూ ఆయన కామెంట్ చేశాడు! ఇక ‘యురి’ సినిమాతో అనూహ్య విజయం సాధించిన విక్కీ కౌశల్ తరువాత బడా బ్యానర్స్, దర్శకులు, నిర్మాతల హాట్ ఫేవరెట్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన ‘ఉదమ్ సింగ్, స్యామ్ మానెక్ షా’ బయోపిక్స్ లో నటిస్తున్నాడు. అలాగే, ‘ద ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’ మూవీలోనూ అలరించనున్నాడు.