'ఆదిపురుష్' సోదరుడిగా విక్కీ కౌశల్!

'ఆదిపురుష్' సోదరుడిగా విక్కీ కౌశల్!

పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్'లో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. సీత పాత్రధారి ఎవరనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే కొంతకాలంగా ఆ పాత్రకు '1... నేనొక్కడినే' ఫేమ్ కృతీసనన్ ను ఎంపిక చేశారనే ప్రచారం బాలీవుడ్ లో జరుగుతోంది. కానీ దర్శకుడు ఓం రౌత్ మాత్రం ఈ విషయమై అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు. ఇక రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తాడనేది తెలిసిందే. ఆయన ఈ పాత్ర తీరుతెన్నులపై చేసిన ప్రకటన వివాదాస్పదం కావడం, తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని సైఫ్ వివరణ ఇవ్వడం కూడా జరిగిపోయింది. తాజాగా ఇప్పుడు లక్ష్మణుడి పాత్రధారి పై బాలీవుడ్ వర్గాలో చర్చ జరుగుతోంది. రాముడి సోదరుడి పాత్ర కోసం ప్రముఖ కథానాయకుడు విక్కీ కౌశల్ ను ఎంపిక చేశార్నది తాజా వార్త. భిన్నమైన కథా చిత్రాలలో నటించి, గుర్తింపు పొందిన విక్కీ కౌశల్ లక్ష్మణుడిగా నటిస్తున్నాడట. ఇప్పటికే అతను షూటింగ్ లో పాల్గొంటున్నాడని సమాచారం. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటన ఏదీ రాలేదు. హాలీవుడ్ టెక్నాలజీతో త్రీడీలో విజువల్స్ వండర్ గా తెరకెక్కుతున్న 'ఆదిపురుష్'పై భారీ అంచనాలే నెలకొన్నాయి.