ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా...

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా...

కరోనా వైరస్‌ సామాన్యుల నుంచి వీఐపీల వరకు ఎవ్వరినీ వదలడంలేదు.. ఇప్పటికే చాలా మంది కరోనాబారినపడగా... తాజాగా, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది... అయితే, ఎలాంటి లక్షణాలు లేకపోవడం, ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉండడంతో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.. ఉపరాష్ట్రపతికి ఇవాళ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఆయన కార్యాలయం తెలిపింది.. ఈ రోజు ఉదయం నిర్వహించిన కోవిడ్‌ టెస్ట్‌లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. అయినప్పటికీ, ఆయనలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు, పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.. దీంతో.. హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. మరోవైపు, ఆయన భార్య శ్రీమతి ఉషా నాయుడుకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఆమెకు నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. అయితే, ఆమెను కూడా హోం ఐసోలేషన్‌లోఉన్నారని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది ఉపరాష్ట్రపతి కార్యాలయం. రాజ్యసభ ఛైర్మన్ కూడా అయిన వెంకయ్యనాయుడు.. ఇటీవల జరిగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు హాజరయ్యారు. ఇక, 25 మందికి పైగా పార్లమెంట్‌ సభ్యులు సైతం కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.