వెంకీ ‘నార‌ప్ప‌’ షూటింగ్ పూర్తి

వెంకీ ‘నార‌ప్ప‌’ షూటింగ్ పూర్తి

టాలీవుడ్ యాక్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో విక్టరీ వెంక‌టేశ్ న‌టిస్తోన్న చిత్రం “నార‌ప్ప‌”. త‌మిళంలో సూప‌ర్‌హిట్‌గా నిలిచిన అసుర‌న్‌కు రీమేక్‌గా నార‌ప్ప‌ తెర‌కెక్కుతుంది. ప్రియ‌మ‌ణి హీరోయిన్ గా నటిస్తోంది. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈమేరకు నార‌ప్ప న‌టీన‌టులు, ఇత‌ర సిబ్బందితో క‌లిసి దిగిన ఫొటోను ట్విట‌ర్ ద్వారా షేర్ చేసుకున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా, కేరాఫ్ కంచ‌ర‌పాలెం ఫేం కార్తీక్ ర‌త్నం కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. త్వరలోనే మిగితా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని, మే 14 న విడుదల కానుంది. కాగా, ‘నారప్ప’కు పోటీగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా ఒక రోజు ముందుగానే (మే 13) విడుదల కానుంది.