సమ్మర్ పైన కన్నేసిన 'నారప్ప'

సమ్మర్ పైన కన్నేసిన 'నారప్ప'

విక్టరీ వెంకటేష్ హీరోగా 'నారప్ప' అనే సినిమా తెరకెక్కుతున్నవిషయం తెలిసిందే. ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ అయిన 'అసురన్' సినిమాకు రీమేక్ . తమిళంలో ధనుష్ పోషించిన ఈ పాత్రను తెలుగులో వెంకటేష్ చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి నటిస్తుంది. మరో హీరోయిన్ గా మలయాళీ బ్యూటీ రెబ్బా మౌనిక ను ఎంపిక చేశారు. ఇక 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఫెమ్ శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ తమిళనాడు తిరుచందూర్ తెరికాడులోని రెడ్ డెసర్ట్ ప్రాంతంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఆతర్వాత కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసి సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే చాలా సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి వాటన్నింటిని సమ్మర్లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నారు. వాటితోపాటే ఇప్పుడు నారప్ప కూడా మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.