అసలు ముహూర్తం ఫిక్స్‌ చేసిందే సీఎం...

అసలు ముహూర్తం ఫిక్స్‌ చేసిందే సీఎం...

గోదావరి పుష్కర స్నానం ముహూర్తాన్ని ఫిక్స్ చేసిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ... గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట ఘటనపై జస్టిస్ సోమయాజులు కమిషన్‌ నివేదికపై స్పందించిన ఆమె... ముఖ్యమంత్రిని‌ కాపాడటానికే సోమయాజులు కమిటీ నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. మూడేళ్ల తర్వాత కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన నివేదిక వస్తుందనుకోలేదన్న వాసిరెడ్డి పద్మ... సోమయాజులు కమిటీ... ఘటన ఎలా జరిగిందన్నదానిపై తప్పుడు నివేదిక ఇచ్చిందని విమర్శించారు. మీడియాను, ‌ప్రజలను దోషులుగా కమిటీ రిపోర్ట్‌లో చూపించారంటూ అసహనం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఇచ్చిన నివేదికలకు సోమయాజులు కమిటీ నివేదికకు అసలు పొంతనే లేకుండా ఉందన్న పద్మ... 30 హత్యలు ప్రభుత్వం చేసిన హత్యలేనని ఆరోపించారు.