దర్శకురాలిగా మారిన నటి

దర్శకురాలిగా మారిన నటి

ఎలాంటి విషయాన్ని అయినా...కుండబద్దలు కొట్టినట్లు చెప్పే నైజం వరలక్ష్మీ శరత్ కుమార్ సొంతం. వరలక్ష్మీ తండ్రి శరత్ కుమార్ గురించిపరిచయం అవసరం లేదు. తమిళనాడులో ఆయన ఒకప్పటి స్టార్ హీరో మాత్రమే కాదు....ప్రస్తుతం పేరుమోసిన పొలిటీషియన్ కూడా.. ప్రస్తుతం ఆయన కుమార్తెగా వరలక్ష్మీ చిత్ర పరిశ్రమలో రాణిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిగా దూసుకుపోతుంది . 
వరలక్ష్మి అటు హీరోయిన్ గా చేస్తూనే.. ఇటు విలనిజం అంటే మగవాళ్ళు మాత్రమే పండించాలనే ఆలోచనల నుంచి దర్శకులని బయటకి తీసుకొచ్చి ఆడవాళ్ళతో కూడా పవర్ ఫుల్ విలనిజం చూపించవచ్చని ఈమె చేసిన పాత్రలతో ప్రూవ్ చేసింది. తమిళంలో పందెంకోడి , విజయ్ సర్కార్ మూవీలలో వరలక్ష్మి పండించిన విలనిజంకి చాలా మంది ప్రశంసలు లభించాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి మెగా ఫోన్ పట్టింది. తెన్నాండాల్ ఫిలింస్ బ్యానర్‌పై రామస్వామి నిర్మాతగా 'కన్నామూచి'(దాగుడుమూతలు) అనే సినిమా రూపొందనుండగా, ఈ సినిమాను వరలక్ష్మీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ ను తెలుగు తమిళ్ హీరోయిన్స్ అందరు తమతమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.