వనస్థలిపురం గ్యాంగ్ వార్ లో వెలుగు చూస్తున్న గంజాయి కోణం...

వనస్థలిపురం గ్యాంగ్ వార్ లో వెలుగు చూస్తున్న గంజాయి కోణం...

వనస్థలిపురం గ్యాంగ్ వార్ లో గంజాయి కోణం వెలుగులోకి వస్తుంది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే గాంజాయి అడ్డా ఉన్నట్లు గుర్తించారు. గంజాయి మత్తులో యువకుల వీరంగం సృష్టించారు. ఆ మత్తులో రోజు గొడవలు ఘర్షణలు అలాగే అమ్మాయిలతో  అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు యువకులు. వారి వీరంగం తో భయాందోళనకు గురవుతున్నారు వనస్థలిపురం కాంప్లెక్స్ వాసులు. పోలీసులకు పలు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇంతకముందు నగరంలో పట్టుబడ్డ గంజాయి తాలూకు కేంద్రాలను వనస్థలిపురంలో గుర్తించారు ఎక్సైజ్ అధికారులు. అయినా వనస్థలిపురం పోలీసులు పూర్తి స్థాయి నిఘా పెట్టలేదు. దాంతో వనస్థలిపురంకి విచ్చలవిడిగా గంజాయి సప్లై అవుతుంది. ఈ వస్తున్న గంజాయి ఎక్కడి నుండి సప్లై అవుతుంది అన్నదానిపై నిఘా పెట్టాలని వనస్థలిపురం పోలీసులకు ఎక్సైజ్ అధికారులు సూచించారు.