వామన్ రావు కేసు : కీలకంగా మారిన నిందితుల ఫోన్ డేటా

వామన్ రావు కేసు : కీలకంగా మారిన నిందితుల  ఫోన్ డేటా

వామన్ రావు దంపతుల హత్య కేసులో  నిందితుడు  బిట్టు  శ్రీను విచారణ కొనసాగుతోంది.  ఈ రోజు విచారణ అనంతరం నిందితుడు బిట్టు శ్రీనును అరెస్ట్ చూసే అవకాశం కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం బిట్టు శ్రీనును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అరెస్ట్ అనంతరం మంథని  కోర్టులో నిందితున్ని ప్రవేశ పెట్టనున్నారు పోలీసులు. అయితే.. వామన్ రావు హత్య కేసులో టెక్నికల్ ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు. పోలీసుల అదుపులో ఉన్న బిట్టు శ్రీను సెల్ ఫోన్ డేటాను సేకరించిన ప్రత్యేక  బృందం... ఘటన జరిగిన తరువాత బిట్టు శ్రీను ఎవరేవరితో మాట్లాడాడో డేటా సేకరిస్తున్నారు.  రిమాండ్ లో ఉన్న నిందితుల ఫోన్ డేటా కూడా సేకరించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ జంట హత్యల కేసులో నిందితుల  ఫోన్ డేటా  కీలకం కానుంది.