'బాహుబలి'ని దాటేసిన 'వకీల్ సాబ్'

'బాహుబలి'ని దాటేసిన 'వకీల్ సాబ్'

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్'‌తో పవర్ ఫుల్ రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా పవన్ మేనియా కొనసాగుతోంది. మరోవైపు 'వకీల్ సాబ్' బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది యూఎస్ ప్రీమియర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రంగా 'వకీల్ సాబ్' రికార్డును క్రియేట్ చేశాడు. 40% ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ యుఎస్ బాక్సాఫీస్ వద్ద వకీల్ సాబ్ 400 కే యుఎస్ డాలర్లను సాధించాడు. తాజాగా 'వకీల్ సాబ్' పలు ప్రాంతాల్లో కలెక్షన్స్ పరంగా 'బాహుబలి'ని దాటేసినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో 'వకీల్ సాబ్' బెనిఫిట్ షోలు లేకుండా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అక్కడ అనేక ప్రాంతాల్లో 'బాహుబలి-2' మొదటిరోజు రికార్డులను 'వకీల్ సాబ్' అధిగమించి ఆల్ టైం రికార్డును క్రియేట్ చేశాడు. చీరాలలో వకీల్ సాబ్ మొదటిరోజు రూ.11,48,476 వసూలు చేయగా... బాహుబలి-2 11 లక్షలు వసూలు చేసింది. చోడవరంలో వకీల్ సాబ్ రూ.9,85,859, బాహుబలి-2 రూ.8,91,450 వసూళ్లు రాబట్టాయి. ఖమ్మంలో కూడా 'వకీల్ సాబ్' కలెక్షన్ల పరంగా 'బాహుబలి' రికార్డ్స్ ని బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది. ఇక రేపు ఆదివారం కావడంతో సినిమా వసూళ్లపరంగా మరిన్ని రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉంది.