వకీల్ సాబ్: మీమ్‌పై రామజోగయ్య శాస్త్రి స్పందన

వకీల్ సాబ్: మీమ్‌పై రామజోగయ్య శాస్త్రి స్పందన

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా రెండో పాట ‘సత్యమేవ జయతే’ నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. విడుదల అయిన కొద్దిసేపటికే ట్రేండింగ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ పాటతో పవన్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ పాట రాసిన సందర్భాన్ని సైతం మిమ్స్ రూపంలో వైరల్ చేస్తున్నారు. ఈ పాటకు మాటలు రాసిన రామజోగయ్య శాస్త్రి ఉద్దేశిస్తూ.. ‘వకీల్ సాబ్ పై పాట రాయమంటే.. పవన్ పై రాశావేంటి ? అనే మీమ్ గీత రచయిత రామజోగయ్య దాకా శాస్త్రి చేరింది. దీనిపై ఆయన ఫన్నీగా సమాధానం ఇచ్చారు.  ‘సినిమా చూసాక మాట్లాడుకుందాం..సరేనా’ అంటూ ఎమోజీతో రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ కామెడీ మీమ్ నెటిజన్లతో పాటుగా వకీల్ సాబ్ టీమ్ ను కూడా ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 9న ఈ సినిమా థియేటర్లోకి రానుంది.