‘ఉప్పెన’ సరైన డేట్ ఫిక్స్ చేసుకుందిగా..!

‘ఉప్పెన’ సరైన డేట్ ఫిక్స్ చేసుకుందిగా..!

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన డెబ్యూ సినిమా ‘ఉప్పెన’. కృతిశెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. సుకుమార్ అసోసియేట్ బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. ఇక సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి ఈ సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా ‘ఉప్పెన’ అన్నీ కార్యక్రమాలని కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సాంగ్స్ ఇప్పటికే ట్రెండింగ్ లో రికార్డ్స్ సాధిస్తున్నాయి. ‘ఉప్పెన’ పూర్తి స్థాయి ప్రేమ కథ కావడంతో వేలంటైన్స్ డే సీజన్లో రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. తాజా సమాచారం ప్రకారం.. ప్రేమికుల రోజు కానుకగా పిబ్రవరి 14న సినిమాని రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. వేసవికి ఆల్రెడీ బెర్తులు బుక్ అయిపోవడం, అక్కడ పోటీ తీవ్రంగా ఉండటంతో మధ్యే మార్గంలో ఫిబ్రవరిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.