హృతిక్ రికార్డ్ బ్రేక్ చేసిన వైష్ణవ్

హృతిక్ రికార్డ్ బ్రేక్ చేసిన వైష్ణవ్

వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి జంటగా నటించిన 'ఉప్పెన' ఘన విజయం సాధించింది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే భారీస్థాయిలో వసూలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ నిర్మించిన ఈ సినిమా పలు రికార్డులను బద్దలు కొడుతోంది. డెబ్యూ హీరో సినిమా ఈ రేంజ్ లో వసూళ్ళు సాధించి ఇప్పటికే టాలీవుడ్ డెబ్యూ హీరోల వసూళ్లను అధిగమించేసింది. ఇక ఏకంగా ఇప్పుడు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రికార్డ్ పై కన్నేసింది. 6వ రోజు కూడా చక్కటి కలెక్షన్లను సాదించిన వైష్ణవ్ 'ఉప్పెన' 21 ఏళ్ల నాటి హృతిక్ రోషన్ డెబ్యూ మూవీ రికార్డ్స్ సైతం దాటేసింది. హృతిక్ 'కహో నా ప్యార్ హై'తో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న డెబ్యూ హీరోగా నిలిచాడు. ఇప్పుడు వైష్ణవ్ హృతిక్ రికార్డుని తిరగరాసాడు. మరి ఇదే ఊపులో 'ఉప్పెన' ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూద్దాం.