కీలక ఆదేశాలు... ప్రిస్క్రిప్షన్ లేకుండా వాటిని అమ్మకండి...

కీలక ఆదేశాలు... ప్రిస్క్రిప్షన్ లేకుండా వాటిని అమ్మకండి...

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ భారతదేశాన్ని సైతం వదలడం లేదు.  దేశంలో ఇప్పటి వరకు 126 కేసులు నమోదయ్యాయి.  ఇందులో ఎక్కువ కేసులు మహారాష్ట్రలో ఉండగా, కేరళ రెండో స్థానంలో ఉన్నది.  ఉత్తరాఖండ్ లో ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది.  ఉత్తరాఖండ్ కు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.  ముఖ్యంగా ఎండాకాలం సమయంలో అక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్యా అధికంగా ఉంటుంది.  ఉత్తరాఖండ్ లో ఆధ్యాత్మిక కేంద్రాలు ఎన్నో ఉన్నాయి.  

మనదేశం నుంచి కంటే విదేశాల నుంచి అక్కడికి వెళ్లే వ్యక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కోవిద్ విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.  మాములు జలుబు, దగ్గు ఉంటె మెడికల్ షాప్ కు వెళ్లి మందులు తెచ్చుకొని వేసుకుంటారు.  కానీ, కరోనా వైరస్ ఉంటె ఆ మందులు పనిచేయవు.  తాత్కాలికంగా ఉపశమనం కలిగినా మరలా విజృంభిస్తుంది.  అందుకే ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.  రాష్ట్రంలో మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా జలుబు, దగ్గుకు మెడిసిన్ లు అమ్మరాదని ఆదేశాలు జారీ చేసింది.  అలానే మాస్కులు, శానిటైజర్లు నిర్ణయించిన ధరకే అమ్మాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.