బ్రేకింగ్ : పీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా

బ్రేకింగ్ : పీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి  రాజీనామా

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ వైఫల్యం చెందింది. 2016 లో కాస్త పరువు నిలబెట్టుకునేలా సీట్లు సంపాదించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరీ దారుణంగా రెండు స్థానాలకు పడిపోయింది. ఈ క్రమంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. పిసిసి అధ్యక్షుడి పదవికి ఉత్తంకుమార్ రెడ్డి రాజీనామా చేసేశారు. ఆయన కొద్ది సేపటి క్రితం తన రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపారు. అంతకుముందే ఆయన ఒక గంటలో కీలక ప్రకటన చేస్తానంటూ మీడియా కి సమాచారం ఇచ్చారు. అదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాయి ఆయన పేర్కొన్నారు.