బీజేపీ టీఆర్ఎస్ చీకటి ఒప్పందం… అందుకే బలహీనమైన అభ్యర్థి ?

బీజేపీ టీఆర్ఎస్ చీకటి ఒప్పందం… అందుకే  బలహీనమైన అభ్యర్థి ?

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో జూమ్ లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు  సమావేశం అయ్యారు.ఏఐసీసీ ఇంచార్జి ఠాగూర్ మాట్లాడుతూ నాగార్జున సాగర్ ఎన్నికలను ఒక ఉప ఎన్నికల లాగా చూడొద్దని, ప్రతి నాయకుడు, కార్యకర్త పూర్తి స్థాయిలో కష్టపడి గెలిపించుకోవాలని అన్నారు. సాగర్ ఎన్నికలు కాంగ్రెస్ కు చాలా కీలకమన ఆయన ప్రతి బూత్ స్థాయిలో నాయకులు పని చేసి మంచి ఫలితాలు వచ్చేలా చూడాలని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీ లు బయటకు కుస్తీ, లోపల దోస్తీలా వ్యవహరిస్తున్నాయని అన్నారు. వాటి బాగోతాన్ని బయటపెట్టి ప్రజల మద్దతు కూడగట్టాలని అన్నారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జానారెడ్డి విజయం ఖాయం అయ్యిందని, ఇక్కడ బీజేపీ పోటీలోనే లేదని అన్నారు. కాంగ్రెస్ కు, టీఆర్ఎస్ కు మధ్యలో పోటీ అని బీజేపీ టీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో భాగంగా బీజేపీ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టిందని అన్నారు.

బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు లోపాయకారి ఒప్పందంలో ఉన్నాయన్న ఆయన బయట కుస్తీ లోపల దోస్తీ తో రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. బీజేపీ ఎంపీ సోయం బాబూరావు లంబాడీలను ఎస్టీ జాబితాలు నుంచో తొలగించాలని ప్రధాన మంత్రికి లేఖ ఇచ్చాడని, ఈ విషయంలో బీజేపీ, టిఆర్ఎస్ లు వారి విధానం ప్రకటించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చామని అన్నారు. టిఆర్ఎస్ మెడలు వంచి ఉద్యోగ నియామకాలు జరపాలంటే జానారెడ్డి లాంటి నాయకులు శాసనసభలో ఉండాలని ఎక్కడ అక్రమాలు బయటపడ్డ టిఆర్ఎస్ ఎమ్యెల్యే ల పేర్లు బయటకు వస్తున్నాయని అన్నారు.  ఇప్పుడు డ్రగ్స్ మాఫియాలో నలుగురు టిఆర్ఎస్ ఎమ్యెల్యేలు ఉన్నారని చెప్తున్నారుని అన్నారు.  కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఆ ఎమ్యెల్యేలను గుర్తించి వారిని బర్తరఫ్ చేసి విచారణ జరిపి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలన్నారు.