మహిళలను రాజకీయంగా ప్రోత్సహించిన పార్టీ కాంగ్రెస్...

మహిళలను రాజకీయంగా ప్రోత్సహించిన పార్టీ కాంగ్రెస్...

తెలంగాణ మహిళా మణులకు మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఉంది. దేశంలో మహిళా అధ్యక్షురాలు గా ఉన్న పార్టీ కాంగ్రెస్. మహిళలను రాజకీయంగా ప్రోత్సహించిన పార్టీ కాంగ్రెస్. మా ప్రభుత్వ హయాంలో  మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగించాం. మహిళా సంఘాలు ఏర్పాటు చేసి వారికి వడ్డీలేని రుణాలు ఇచ్చి వారిని వ్యాపారవేత్తలుగా, పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సాహకాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలది. నేడు అన్ని రంగాలలో మహిళలకు ప్రాధాన్యత దక్కుతుంది అంటే అందుకు కాంగ్రెస్ పార్టీ విధానాలే కారణం అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ లో మహిళలకు రాజకీయంగా అనేక ఉన్నత పదవులు ఇచ్చాం. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఏఐసీసీ అధ్యక్షులు, లోక్ సభ స్పీకర్ గా అనేక ఉన్నత పదవులు కల్పించాం.. స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది. నేడు లక్షలాది మంది మహిళలు సర్పంచులు, ఎంపీటీసీ లు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మైన్ లు, మునిసిపల్ కౌన్సిలర్లు, చైర్మన్ లు, కార్పిరేటర్లు, మేయర్లు అవుతున్నారంటే అది కాంగ్రెస్ ఘనతనే. దేశంలో మహిళల భద్రత కోసం పకడ్బందీగా చట్టాలు చేసి కఠినంగా అమలు చేసాము.  మహిళల చేతిలో ఈ దేశ భవిష్యత్ ఉంది. జనాభాలో సగం ఉన్న మహిళలు ఇంకా అన్ని రంగాలలో సమానంగా అవకాశాలు పొందాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.