కేంద్రంలో మోడీ..రాష్ట్రంలో కేసీఆర్ ప్రజాస్వామ్యం కూనీ చేస్తున్నారు 

కేంద్రంలో మోడీ..రాష్ట్రంలో కేసీఆర్ ప్రజాస్వామ్యం కూనీ చేస్తున్నారు 

కేంద్రంలో మోడీ..రాష్ట్రంలో కేసీఆర్ ప్రజాస్వామ్యం కూనీ చేస్తున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతుల సమస్యలు చెప్పడానికి గవర్నర్ కి వినతి పత్రం ఇద్దాం అనుకుంటే ఆటంకం కలిగిస్తున్నారని ఫైర్‌ అయ్యారు.  రైతులను నట్టేట ముచ్చడానికే మూడు బిల్లులను కేంద్రం తీసుకువచ్చిందన్నారు.   రాజ్యసభలో బలం లేకున్నా బిల్లులు ఆమోదం చేసుకుని అంబానీ, ఆధానిలకు తొత్తులని బీజేపీ నిరూపించుకుందని మండిపడ్డారు. మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించాలని  బిల్లులో ఎక్కడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  కరోనా ఉంది అని చెప్పి గవర్నర్ ను కలవకుండా ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అదే సీఎం కేసీఆర్ కి గవర్నర్‌  అపోయింట్మెంట్ ఎలా ఇచ్చారని...కేసీఆర్‌కు కరోనా అభ్యంతరం లేదా అని ప్రశ్నించారు ఉత్తమ్‌. వ్యవసాయ బిల్లును వ్యతిరేకించడంలో కేసీఆర్‌ కు చిత్తశుద్ధి లేదన్నారు. ఇప్పటి వరకు బీజేపీ తెచ్చిన అన్ని బిల్లులకు కేసీఆర్‌ మద్దతు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్‌ ములాఖత్‌ అయ్యారని ఆరోపణలు చేశారు.