ఆ యుద్దాలను మించిన కోవిడ్ మరణాలు
ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. ప్రపంచంలో ఇప్పటి వరకు కోట్లాది మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 24 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. ఇక ఒక్క అమెరికాలోనే 5 లక్షలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి. ప్రపంచంలో అత్యధిక మరోనా మరణాలు అమెరికాలోనే ఉండటం విశేషం. ఇక, రెండో ప్రపంచం యుద్ధం సమయంలో 4.05 లక్షల మంది మృత్యువాత పడ్డారు. అలానే వియాత్నం యుద్ధంలో 58వేలమంది, కొరియా యుద్ధంలో 36 వేలమంది మరణించారు. ఈ మూడు యుద్ధాల్లో ఎంతమంది మరణించారో అంతమంది కరోనా కారణంగా అమెరికాలో ఒక్క ఏడాదిలోనే మరణాలు సంభవించాయి. ప్రపంచంలో కరోనా మరణాల్లో 20 శాతం మరణాలు అమెరికాలోనే ఉండటం విశేషం. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నట్టు అమెరికా పేర్కొన్నది. వ్యాక్సిన్ తీసుకున్నా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని అమెరికన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో కరోనా మరణాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)