చైనా విషయంలో మోడీ మీద యూఎస్ సెనేటర్ ప్రశంశలు

చైనా విషయంలో మోడీ మీద యూఎస్ సెనేటర్ ప్రశంశలు

సరిహద్దు వివాదంపై చైనా దురాక్రమణకు భారత్ లొంగకపోవడాన్ని అమెరికాకు చెందిన ఒక టాప్ సెనేటర్ ప్రశంసించారు. ఈ దెబ్బతో చైనాకు సంబంధించిన విషయాలలో ఇతర దేశాలు కూడా నిర్భయంగా వ్యవహరిస్తాయని ఆయన పేర్కొన్నారు. చైనా దురాక్రమణ విషయంలో అండగా నిలివాలని ఇతర దేశాలను మోడీ కోరడాన్ని సెనేటర్ జాన్ కెన్నెడీ గురువారం ప్రశంసించారు. చైనాకు వ్యతిరేకంగా బలగాలలో చేరాలని ఇతర దేశాలను కోరారు. జాన్ మీడియాతో మాట్లాడుతూ, "భారతదేశంలో మోడీ చైనాకు ఎదుర్కొనేలా నిలబడటం నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే కెనడా విషయంలో కూడా నాకు చాలా గర్వంగా ఉంది. ప్రతి దేశం పూరిపోయి మూలన దాక్కోవడం లేదని ఆయన పేర్కొన్నారు. అమెరికా సంగతి పక్కన పెడితే చైనాను నమ్మడానికి ఏ కంట్రీ సిద్దంగా లేదని ఆయన అన్నారు.