బైడెన్‌ హెచ్చరిక.. కోవిడ్‌తో 6 లక్షల మంది చనిపోవచ్చు..

బైడెన్‌ హెచ్చరిక.. కోవిడ్‌తో 6 లక్షల మంది చనిపోవచ్చు..

అమెరికాలో కరోనావైరస్‌ మరణాల సంఖ్య 6 లక్షల మార్క్‌ను కూడా క్రాస్‌ చేయవచ్చని హెచ్చరించారు ఆ దేశ కొత్త అధ్యక్షుడు జో బైడెన్... కోవిడ్ -19తో పోరాడటానికి, ఈ సమయంలో కష్టాల్లో పడిపోయిన అమెరికన్లకు ఆర్థిక ఉపశమనం కలిగించే 1.9 ట్రిలియన్ డాలర్ల ప్రణాళికపై వేగంగా ముందుకు వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.. యూఎస్‌లో ఇప్పటి కోవిడ్‌ మరణాల సంఖ్య 4 లక్షలకు చేరిందని.. ఆ సంఖ్య వచ్చే నెలలోనే 5 లక్షలు దాటొచ్చన్న ఆయన... మొత్తంగా కరోనా మరణాలు దేశవ్యాప్తంగా 600,000 పైగా చేరుకుంటాయని భావిస్తున్నానని వెల్లడించారు. చాలా కుటుంబాలు ఆకలితో ఉన్నాయి. మరిన్ని ఉద్యోగాలు తొలగించే ప్రమాదం కూడా లేకపోలేదు.. ఉద్యోగ నష్టాలు మళ్లీ పెరుగుతున్నాయి.. ఈ సమయంలో వాటిని అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తన రెస్క్యూ ప్లాన్ ద్వారా ప్రజల సహాయం చేసేందుకు ముందుకు వెళ్లాలనుకుంటున్నాను.. దీనికి సభలోని రెండు పార్టీలతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్టు బైడెన్‌ తెలిపారు.