అప్పుడు ఎరిక్... ఇప్పుడు ఫ్లాయిడ్...ఓ ఉద్యమం  

అప్పుడు ఎరిక్... ఇప్పుడు ఫ్లాయిడ్...ఓ ఉద్యమం  

అమెరికాలో ఆగ్రహజ్వాలలు భగ్గుమన్నాయి.  ఒకవైపు కరోనా కేసులు ఇబ్బందులు పెడుతుంటే, మరోవైపు జాత్యహంకార ఉద్యమం రగులుకుంటోంది.  అప్పుడెప్పుడో ఒకసారి ఇలాంటి ఉద్యమం జరిగింది.  ఫలితంగా అమెరికన్ పౌరులు అందరూ ఒక్కటే అని, రంగును బట్టి చూడకూడదని చెప్పి చట్టం చేశారు. 2014లో పోలీసుల చర్య వలన ఎరిక్ అనే వ్యక్తి మరణించాడు.  పొగాకు ఉత్పత్తులను అధికంగా అమ్ముతున్నాడు అనే ఆరోపణలో అతడిని పోలీసులు కొట్టి చంపారు.  పోలీసులు మెడపై కాలుపెట్టి గట్టిగా ఒత్తిపట్టడంతో, ఐ కాంట్ బ్రీత్ అని అరుస్తూ మరణించాడు.  

ఎరిక్ మరణంతో అప్పట్లో రగడ మొదలైంది.  ఎరిక్ మరణానికి కారకులైన పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.  ఎరిక్ కుటుంబానికి భారీ నష్టపరిహారం చెల్లించింది ప్రభుత్వం.  అదే తరహా హత్యోన్మాదం మరోసారి మే 25, 2020న మినియాపోలిస్ లో జార్జ్ ఫ్లాయిడ్ అనే యువకుడిని పోలీసులు చంపేశారు.  ఫ్లాయిడ్ చనిపోయే చివరి 30 నిముషాలు అనేక ఇబ్బందులు పడ్డాడు.  ఐ కాంట్ బ్రీత్ అంటూ అరుస్తూనే ఉన్నాడు.  కానీ, పోలీసులు పట్టించుకోలేదు.  

దీనికి సంబంధించిన వీడియో అదేరోజు రాత్రి సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో ప్రజలు రోడ్డుపైకి వచ్చారు.  ఆందోళన చేశారు. మినియాపోలిస్ లో ప్రారంభమైన ఈ రగడ రెండు రోజుల్లో 16 రాష్ట్రాలకు పాకింది. కరోనా ప్రాభవం అత్యధికంగా ఉన్న న్యూయార్క్ నగరంలో కూడా దీని ప్రభావం అధికంగా కనిపించింది.  వాషింగ్టన్ నగరంలోని అమెరికా అధ్యక్షుడి భవనం ఎదుట నిరసనకారులు ఆందోళన చేయడం, ట్రంప్ వారిని ఆందోళనకారులుగా వర్ణించడంతో పాటుగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో రాజధాని నగరం వాషింగ్టన్ నగరం భగ్గుమన్నది.  నిరసనకారులు ప్రబ్లిక్, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు.  అధ్యక్ష భవనానికి కూతవేటు దూరంలో ఉన్న ప్రముఖ చర్చికి నిప్పు అంటించారు.  ఎప్పుడూ లేని విధంగా అమెరికాలో ఆందోళనలు జరుగుతున్నాయి.  మరి దీని నుంచి అమెరికా ఎలా బయటపడుతుందో చూడాలి.  ఈ ఏడాది చివర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న తరుణంలో రంగుకు సంబంధించిన నిరసనలు జరుగుతుండటం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.