కరోనా విషయంలో ఇండియా భేష్...
ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో పాటుగా ఇండియాలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. దేశీయంగా వ్యాక్సిన్లు అందిస్తూనే పొరుగుతున్న దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్లను ఇండియా అందిస్తోంది. మాల్దీవులు, బంగ్లాదేశ్, మారిషస్, భూటాన్ తదితర దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించి తన మైత్రిని చాటుకుందని అమెరికా సౌత్ సెంట్రల్ ఏషియా విభాగం ట్వీట్ చేసింది. ఇక వాణిజ్య ఎగుమతుల విషయంలో కూడా ఇండియా దూకుడుగా వ్యవహరిస్తోంది. దక్షిణాఫ్రికా, బ్రెజిల్, మొరాకో వంటి దేశాలకు వ్యాక్సిన్ లను సరఫరా చేస్తున్నది. కరోనా కట్టడికోసం ఇండియా చేస్తున్న కృషిని ప్రపంచదేశాలు మెచ్చుకుంటున్నాయి. అటు ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఇండియాను మెచ్చుకుంటూ ట్వీట్ చేసింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)