బైక్ కోసం భార్యను అమ్మకానికి పెట్టాడు... చివరకు...

బైక్ కోసం భార్యను అమ్మకానికి పెట్టాడు... చివరకు...

బైక్ కోసం కొనుక్కోవడం కోసం లోన్ తీసుకుంటారు, లేదంటే మరొకటి తాకట్టుపెట్టి కొనుక్కుంటారు.   ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి కొనుక్కుంటారు. కానీ, ఉత్తరప్రదేశ్ లోని లుథియా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బైక్ పై మోజుతో కట్టుకున్న భార్యను తాకట్టుపెట్టడం చర్చనీయాంశంగా మారింది.  బైక్ కోసం డబ్బులు ఇవ్వాలని భార్యను రోజు హింసించేవాడు.  భర్త హింసను భరించలేక ఆ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది.  

దీంతో డబ్బుల కోసం భర్త ఫోటోలను, ఫోన్ నెంబర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఆమెతో మాట్లాడాలి అనుకునే వాళ్ళు, సమయం గడపాలి అనుకునే వాళ్ళు ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయాలని పోస్ట్ చేశాడు.  ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  భార్య ఫోన్ నెంబర్ కు వరసగా కొంతమంది ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో షాకైన భార్య పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది.  దీంతో సోషల్ మీడియాలో పోస్ట్ క్రియేట్ చేసిన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.