కుప్పంలో కాల్పుల కలకలం.. ప్రతిపక్ష పార్టీ నేత లక్ష్యంగా దాడి !

కుప్పంలో కాల్పుల కలకలం.. ప్రతిపక్ష పార్టీ నేత లక్ష్యంగా దాడి !

చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దులో కాల్పుల కలకలం రేపుతోంది. డీఎంకే నేత వేలాయుధంపై నాటు తుపాకీలతో కాల్పులు జరిపారు దుండగులు. దీంతో డీఎంకే నేత వేలాయుధం తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించి అందిస్తున్నారు. కుప్పం సమీపంలోని తమిళనాడు రాష్ట్రం నారాయణపురంలోఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల తర్వాత నిందితులు కుప్పం వైపు పరారయ్యారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు పోలీసులు.