కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా

దేశంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు కేంద్రమంత్రులు కూడా కరోనా బారినపడ్డారు. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. తనతో టచ్‌లోకి వచ్చిన వారందరూ వెంటనే కరోనా టెస్టులు నిర్వహించుకోవాలని ఆమె ట్వీట్ చేశారు.