ఫ్లాష్ : ఐసొలేషన్‌లో కేంద్ర మంత్రి రవిశంకర్

ఫ్లాష్ : ఐసొలేషన్‌లో కేంద్ర మంత్రి రవిశంకర్

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 18 లక్షలు దాటాయి. ఈ వైరస్ ఎవరినీ వదలడం లేదు. మాములు ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరికి సోకుతోంది. తాజాగా.. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను శనివారం కలిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమిత్‌ షాకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా ఆదివారం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో తనను కలిసిన వారంతా హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో అమిత్‌ షాను కలిసిన పలువురు ఐసొలేషన్‌లో ఉంటున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో తాను కూడా స్వీయ ఐసొలేషన్‌ విధించుకున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.