కరోనా మరణాల కంటే రోడ్డు ప్రమాదాలే  ఎక్కువ... 

కరోనా మరణాల కంటే రోడ్డు ప్రమాదాలే  ఎక్కువ... 

ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల్లో రోజు కొన్ని వందల మంది మృతి చెందుతున్నారు.  ప్రమాదాల మరణాల శాతం పరంగా చూసుకుంటే మనదేశంలోనే అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నాయి.  భారత దేశంలోని యూపీ రాష్ట్రంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాల మరణాలు నమోదవుతున్నాయని గణాంకాలు చెప్తున్నాయి.  గత ఏడాది కాలంలో దేశంలో 1.45 లక్షల కొరోనా మరణాలు సంభవిస్తే, 1.51 లక్షల రోడ్డు ప్రమాదాల మరణాలు సంభవించాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా మహమ్మారి కంటే రోడ్డు ప్రమాదాలు మరింత ప్రమాదకరంగా ఉన్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ పేర్కొన్నారు.  అన్ని రాష్ట్రాలు రోడ్డు ప్రమాదాల మరణాలను నివారించడంపైనే దృష్టి పెట్టాలని కోరారు.  తమిళనాడు రాష్ట్రంలో 55శాతం వరకు రోడ్డు ప్రమాదాలను నివారించగలిగినట్టు గడ్కారీ తెలిపారు.  తమిళనాడు రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.  ప్రమాదాల్లో ఎక్కువగా యువత చనిపోతున్నారని, హెల్మెట్ వాడకపోవడం వలనే ఇలా జరుగుతున్నట్టు గడ్కారీ తెలిపారు.