నోముల కుటుంబానికి కిషన్‌రెడ్డి పరామర్శ.. సిద్ధాంతాలు వేరైనా..!

నోముల కుటుంబానికి కిషన్‌రెడ్డి పరామర్శ.. సిద్ధాంతాలు వేరైనా..!

ఇటీవల కన్నుమూసిన ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కుటుంబాన్ని పరామర్శించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి... నకిరేకల్‌లోని నరసింహయ్య నివాసానికి వెళ్లిన ఆయన.. నోముల చిత్ర పటానికి శ్రద్దాంజలి ఘటించారు... అనంతరం నోముల నరసింహయ్య కుటుంబసభ్యులను కలసి ఓదార్చారు.. నరసింహయ్యతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి.. ఇద్దరం ఎదురెదురు క్వార్టర్స్‌లో నివాసం ఉండేవాళ్లమని గుర్తుచేసుకున్నారు.. మా సిద్ధాంతాలు వేరైనా.. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాడేవాళ్లమని.. 2004లో పరిచయం అయిన మేం.. ఆ స్నేహం కొనసాగించామన్నారు. ఆయన చనిపోయే 4 గంటల ముందు కూడా నాతో మాట్లాడారు.. ఎవరికి భయపడకుండా బడుగు బలహీన వర్గాలు కోసం ఆయన పనిచేశారని తెలిపారు. తెలుగు ప్రజలు, చేతి వృత్తుల పనివారు నరసింహయ్యను మరచిపోలేరన్న కిషన్‌రెడ్డి.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.. మరి కొంత కాలం ఆయన జీవించి ఉంటే పేద ప్రజలకు మరింత మేలు జరిగేదన్నారు. కాగా, గతంలో సీపీఎం నుంచి నకిరేకల్ నియోజకవర్గం నుంచి నోముల నర్సింహయ్య ప్రాతినిథ్యం వహించిన సమయంలో.. బీజేపీ ఎమ్మెల్యేగా కిషన్ రెడ్డి పనిచేసిన సంగతి తెలిసిందే.