విశాఖ ఉక్కుపై ఇవాళ క్లారిటీ ఇవ్వనున్న కేంద్రం..!

 విశాఖ ఉక్కుపై ఇవాళ క్లారిటీ ఇవ్వనున్న కేంద్రం..!

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం బీజేపీ మినహా మిగతా రాజకీయ పార్టీలన్నీ ఏకం అవుతున్నాయి.. ఇక, కార్మికల సంఘాలు, ప్రజా సంఘాలు ధర్నాలు, ఆందోళనలతో.. తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నాయి.. అయితే, ఇవాళ విశాఖ ఉక్కు పరిశ్రమపై క్లారిటీ ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం... ఇప్పటికే లోక్‌సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గొడ్డేటి మాధవి, ఎంవీవీ సత్యనారాయణ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ప్రశ్నలు వేయగా.. ఇవాళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.. రాజ్యసభ ఉయమే ప్రారంభమై.. మధ్యాహ్నానికి వాయిదా పడగా.. ఇక, సాయంత్రం లోక్‌సభ ప్రారంభం కానుంది.. సాయంత్రం 4 గంటలకు లోకసభలో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై జవాబు ఇవ్వనున్నారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. దీంతో.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ అనుమతి ఇచ్చిందా.. ? స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తోందా..?  స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, ఉద్యోగాల కల్పనపై పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్నారా..? తదితర అంశాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.